INDW vs ENGW : పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన హర్లీన్ డియోల్ (24) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. చార్లీ డీన్ ఓవర్లో రెండు బౌండరీలతో చెలరేగిన డియోల్ చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగింది. అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలా? వద్దా? అని సందేహంగా పెవలిలియన్ వైపు నడిచింది. కానీ, మంధాన రివ్యూ తీసుకోవాలనుకుంది. అప్పటికే సమయం దాటిపోవడంతో అంపైర్ తిరస్కరించింది. దాంతో.. 42 వద్ద వికెట్ పడింది.
ప్రస్తుతం క్రీజులో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (9 నాటౌట్)లు జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి టీమిండియా 42 పరుగులు చేసింది. ఇంకా భారత్ విజయానికి 245 రన్స్ అవసరం.
A big wicket for England Women as Harleen Deol was looking threatening here!
She walks back for a brisk 24 off 31, and India Women are 42/2 🏏
📸: JioHotstar#CWC25 #INDWvsENGW #HarleenDeol #InsideSport #CricketTwitter pic.twitter.com/UuYW6Oy5V8
— InsideSport (@InsideSportIND) October 19, 2025
ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. పేసర్ లారెన్ బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి షాట్‌కు యత్నించగా వికెట్ కీపర్ అమీ జోన్స్ చక్కని క్యాంచ్ అందుకుంది. దాంతో.. 13 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్(24) లారెన్ బెల్ వేసిన 7వ ఓవర్లో రెండు బౌండరీలు బాది ఊపు తెచ్చింది. అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ బౌలింగ్‌లోనూ బౌండరీ బాదింది. పవర్ ప్లే చివరి ఓవర్లో రెండో ఫోర్లతో జోరు చూపించిన తను.. చివరి బంతికి ఎల్బీగా ఔటయ్యింది.