మనసును మార్చే మాసం
జీవితం ఉరుకులు పరుగుల మయం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో హడావుడి. ఈ పరుగులో అసలు మనం ఎటు వెళ్తున్నాం? ఎందుకు బతుకుతున్నాం? అని ఒక్క క్షణం ఆగి ఆలోచింపజేసే మాసం ‘రంజాన్'.
జీవితం ఉరుకులు పరుగుల మయం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు
ఏదో హడావుడి. ఈ పరుగులో అసలు మనం ఎటు వెళ్తున్నాం? ఎందుకు బతుకుతున్నాం? అని ఒక్క క్షణం ఆగి ఆలోచింపజేసే మాసం ‘రంజాన్’. రంజాన్ అంటే కేవలం కడుపుని ఖాళీగా ఉంచడం కాదు, మనసుని మంచి ఆలోచనలతో నింపుకోవడం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొన్ని సామాన్య ఉదాహరణలతో అర్థం చేసుకుందాం.
ఆ కౌగిలిలో ఉండే భరోసానే.. ‘తఖ్వా’
చాలామందికి ‘తఖ్వా’ (దైవభీతి) అంటే దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయం అనుకుంటారు. కానీ అది నెగెటివ్ భయం కాదు. ఒక చిన్న బిడ్డను ఊహించుకోండి. తల్లి కోపగించుకున్నప్పుడు ఆ బిడ్డ భయపడి ఇంట్లోకి వెళ్లకుండా బయట ఎక్కడో దాక్కోదు. ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ వెళ్లి ఆ తల్లి కాళ్లనే పట్టుకుంటుంది. ఆ తల్లి కౌగిలిలోనే తనకు రక్షణ అని ఆ బిడ్డకు తెలుసు. దైవభీతి కూడా సరిగ్గా ఇలాంటిదే! అల్లాహ్ ఆగ్రహానికి గురవుతామేమో అన్న భయంతోనే ఆయన కారుణ్యం వైపు పరుగెత్తడం, ఆయనకు మరింత దగ్గరవ్వడం. అదే అసలైన ‘తఖ్వా’.
మనసును చూసే కన్ను
మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరూ లేకపోయినా, పైన కెమెరా ఉందని తెలియగానే జాగ్రత్తపడతాం. ఆ కెమెరా మనల్ని గమనిస్తోందని, నిబంధన అతిక్రమిస్తే చలాన్ పడుతుందని మనకు తెలుసు. నిజానికి మన జీవితంలోనూ ఇలాంటి ఒక నిఘా నేత్రం అవసరం. అదే ఆధ్యాత్మిక స్పృహ. ఎవరూ చూడటం లేదని అబద్ధం చెప్పడం, ఒంటరిగా ఉన్నాం కదా అని తప్పుడు పని చేయడం లాంటివి చేయకుండా.. ‘నా దేవుడు నన్ను చూస్తున్నాడు’ అనే స్పృహతో ఉండటమే ఉపవాసం మనకు నేర్పే పాఠం. రోడ్డుపై క్రమశిక్షణ మనల్ని ప్రమాదాల నుంచి ఎలా కాపాడుతుందో, జీవితంలో ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ మనల్ని పాపాల నుంచి అలా రక్షిస్తుంది.
ఖురాన్: ఒక జీవన మార్గదర్శి
రంజాన్ నెలలో ఖురాన్ పారాయణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే, ఇది కేవలం చదివి వదిలేసే పుస్తకం కాదు. ఇది ఒక మ్యాప్ లాంటిది. మనం తెలియని ఊరు వెళ్తున్నప్పుడు గమ్యం చేరడానికి మ్యాప్ ఎలా వాడతామో, పరలోకంలో విజయం సాధించడానికి ఖురాన్ అలా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని అర్థం చేసుకుంటూ చదవడం, ఆచరించడం ముఖ్యం.
ఈ నెలలో మనం చేసే ‘సాధన’
ఈ 30 రోజుల ప్రయాణంలో మనం కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి: మాటపై అదుపు: కడుపు మాడ్చుకుంటూ పక్కవారిపై చాడీలు చెబితే ఆ ఉపవాసానికి విలువ ఉండదు. సేవలో సార్థకత: ఒక ఫర్జ్ నమాజ్ చేస్తే 70 రెట్ల పుణ్యం వచ్చే ఈ కాలంలో, పేదవారికి చేసే సాయం కూడా అదే స్థాయిలో మనల్ని దేవుడికి దగ్గర చేస్తుంది. చివరి మెట్టు: రంజాన్ చివరి పది రోజులు చాలా కీలకం. ముఖ్యంగా ‘లైలతుల్ ఖద్’్ర అనే మహోన్నతమైన రాత్రి కోసం చేసే అన్వేషణ మన జీవితాన్నే మార్చేయగలదు.
చివరగా..
గుర్రాన్ని అదుపు చేసే కళ్లెంలాగా, మన అహంకారాన్ని అదుపు చేసే కళ్లెమే ఈ రంజాన్. ఈ నెల ముగిసే సమయానికి మనలో కోపం తగ్గి, ఓర్పు పెరగాలి. ఈ మార్పే మనల్ని ఒక సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దుతుంది.
-ముహమ్మద్ ముజాహిద్, 9640622076
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

