పాట్నా, డిసెంబర్ 15: బీహార్లో పట్టపగలు కోర్టు ప్రాంగణంలో హత్య జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడైన అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్ను పాట్నాలోని ఓ కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు తీసుకొచ్చారు. అతడిని వ్యాన్ నుంచి కిందకు దించగానే ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు.
దీంతో అభిషేక్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.