న్యూఢిల్లీ : యజమాని కారుతో పాటు రూ. 1.06 కోట్ల నగదుతో పరారైన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరాకు చెందిన బిల్డర్ వద్ద 17 ఏండ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఈ దురాగతానికి తెగబడ్డాడు. నిందితుడిని మహారాష్ట్రలోని అకోలాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సంతోష్ చవాన్‌గా గురించారు.
కారు, నగదుతో పరారైన చవాన్ చాకచక్యంగా వ్యవహరిస్తూ సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో వాహనాలను మార్చేవాడు. నిందితుడి నుంచి చోరీ సొత్తులో అధిక భాగం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు బిల్డర్ కార్యాలయం నుంచి మరో రూ. 75 లక్షలు కాజేశాడు.
అలండిలోని ఓ గెస్ట్‌హౌస్‌లోకి ఎంటరయ్యేందుకు చవాన్ తన బంధువు సాయంతో చెకిన్ అవడంతో పాటు అతడి పేరిట మరో సిమ్ కార్డ్ కొనుగోలు చేశాదు. తన బంధువు వద్ద రూ. 50 లక్షలు ఉంచి ఆపై మిగిలిన మొత్తంతో అకోలాకు వెళ్లాడు. నిఘా పెట్టిన పోలీసులు చవాన్ కదలికలను పసిగట్టి అకోలా వద్ద అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Cancer Matrimony | క్యాన్సర్ పేషెంట్ల కోసం స్పెషల్ మ్యాట్రిమోనీ.. దీని వెనుక ఓ కన్నీటి గాథ!