ముంబై, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల కారణంగా ముంబైలో మోనో రైలు మొరాయించింది. ట్రాక్‌పై నిలిచిపోయింది. మంగళవారం భారీ వర్షం కారణంగా విద్యుత్తు సరఫరా సమస్య ఏర్పడి ఎత్తుగా ఉన్న ఎలివేటెడ్ ట్రాక్‌పై ప్రయాణిస్తున్న మోనో రైలు చెంబూర్-భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు రెండు గంటలకు ఊపిరాడక అవస్థలు పడ్డారు.
ట్రైన్ నిలిచిపోయే సమయానికి కిక్కిరిసి ఉందని, అందులో 550 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.