IndiGo flight | ముంబై నుంచి గువాహటి వెళ్తున్న ఇండిగో విమానం.. ఢాకాలో అత్యవసర ల్యాండింగ్
ముంబై నుంచి గువాహటి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయింది.
న్యూఢిల్లీ: ముంబై నుంచి గువాహటి వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo flight) బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయింది. ఇండిగో ఎయిల్లైన్స్కు చెందిన 6ఈ5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. అయితే గువాహటి విమానాశ్రయంపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో సరిగా కనిపంచక ల్యాండింగ్ సాధ్యంమవలేదు. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లించారు. శనివారం ఉదయం 4 గంటలకు ఢాకాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది.
విమానంలో ఉన్న ప్రయాణికులంతా పాస్పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటామని అందులో ప్రయాణిస్తున్న ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో రాసుకొచ్చారు. గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఎయిర్పోర్ట్లో విమానం దిగడానికి వీలుపడలేదు. దీంతో తాము ఢాకాలో ల్యాండ్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం విమానంలోనే ఉన్నామన్నారు.
I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn’t land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️
— Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

