ముంబై, నవంబర్ 14: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం అలజడి సృష్టించింది. గురువారం గుర్తు తెలియని వ్యక్తి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. ముంబై నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో మహమ్మద్ అనే వ్యక్తి బాంబులను తీసుకెళ్తున్నాడని హెచ్చరించాడు. దీంతో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. (ఎన్ఐఏ) సైబర్ విభాగం విచారణను ప్రారంభించింది.