బెంగళూరు: అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన మహాలక్ష్మి (29) హత్య కేసులో ప్రధాన అనుమానితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో మరణించాడు. విశ్వసనీయ వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు అతడు వేలాడుతూ కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. మహాలక్ష్మి ముఖ్య స్నేహితుల్లో ముక్తి ఒకడు. మహాలక్ష్మి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం పట్ల ముక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇటీవల మహాలక్ష్మిని విడిచిపెట్టిన ఆమె భర్త హేమంత్ దాస్‌ను ఉటంకిస్తూ వెలువడిన కథనాల ప్రకారం, ఉత్తరాఖండ్‌కు చెందిన అష్రఫ్ కొంతకాలం క్రితం మహాలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె హత్యలో అష్రఫ్‌కు ప్రమేయం ఉందని దాస్ ఆరోపించారు. ముక్తి కోసం ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దులకు బెంగళూరు పోలీసు బృందాలు వెళ్లాయి. అయితే ముక్తి మరణించినట్లు ఒడిశా పోలీసులు వెల్లడించారు.