Union Cabinet Decisions | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, రైతులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం డీఏను పెంచనున్నట్లు ప్రకటించింది. 2025-26 రబీలో ఆరు పంటలకు కనీస మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఆరుపంటల కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. గోధుమల కనీస మద్దతు ధరను రూ.2425, బార్లీ మద్దతు ధరను రూ.1,980. మినుములు రూ.5,650, కందులు రూ.6,700, ఆవాలు రూ.5,950, కుసుమల ధరను రూ.5,940 పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే, రబీలో యూరియేతర ఎరువులకు రూ.24,475 కోట్ల రాయితీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.