all party meeting | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని (all party meeting) నిర్వహించింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ భేటీకి పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు (Kiren Rijiju), అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
#WATCH | Delhi: MPs attend the all-party meeting ahead of the #Budget Session of Parliament that commences tomorrow, 31st January 2025. pic.twitter.com/1sogq67Ejv
— ANI (@ANI) January 30, 2025
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఇక రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అయిన అరగంట తర్వాత.. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడుతారు.
Also Read..
Mahatma Gandhi | మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు
Cosmetic Products: లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌లతో జాగ్రత్త.. వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి