న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్‌గా డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ప్రకటించిన మంకీపాక్స్ క్లేడ్-1బీ రకం వైరస్ భారత్‌లో ప్రవేశించింది. కేరళలో మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏండ్ల వ్యక్తికి గతవారం ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి మ నీశ్ వర్మ సోమవారం మీడియాకు తెలిపారు.
దుబాయ్ నుంచి వచ్చిన అతడిని గతవారం కేరళ ప్రభుత్వం మంకీపాక్స్ అనుమానిత కేసుగా గుర్తించి, ఐసోలేషలో ఉంచింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటివరకు 30 ఎంపాక్స్ కేసులు వెలుగులోకి రాగా, అవన్నీ క్లేడ్-2 రకానికి చెందినవిగా వైద్య పరీక్షలో తేలింది.