TMC | టీఎంసీకి ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా.. కాసేపటికే సీఎం హిమంత బిస్వ శర్మతో భేటీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది.
హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ఓ వైపు మమతా బెనర్జీపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించగా నేడు ఎంపీలు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. మొన్నటికి మొన్న తృణమూల్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశారు. ఆ సంఘటన మరిచిపోక ముందే నేడు మరో ఎంపీ సుష్మితా దేవ్(MP Sushmita Dev ) కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాగా, ఆమె రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఢిల్లీలోని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ నివాసంలో ఆయనతో పాటు సుష్మితా దేవ్ నవ్వుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే విషయంపై ఓ విలేకరి ఎంపీ సుష్మితా దేవ్ను అస్సాంతో ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా.. కేవలం అస్సాంతో మాత్రమే సంబంధం ఉంది అని చమత్కరించారు. ఈ వారం రోజుల్లోనే ఇద్దరు టీఎంసీ ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏలో చేరనున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

