ముంబై: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరి పక్షాన ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్‌కు షాకిచ్చిన అజిత్ పవార్ (Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి అధికారపార్టీ చెంత చేరారు. పార్టీని చీల్చిన గంటల వ్యవధిలోనే ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తాజాగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ (MP Sanjay Raut) అన్నారు.
అజిత్ పవార్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత శిండే వర్గానికి చెందిన 17 నుంచి 18 ఎమ్మెల్యేలు (MLAs) తమతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఎన్సీపీ రెబల్ ఎమ్మెల్యేలకు (NCP MLAs) మంత్రి పదవులు కట్టబెట్టడంతో షిండే వర్గానికి చెందినవారు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. మంత్రులు కావాలనుకున్నవారు, క్యాబినెట్ విస్తరణలో తమ పదవులు కోల్పోయేవారు తమతో చట్‌లో ఉన్నారని తెలిపారు. మాతోశ్రీకి (Matoshree) తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాగా, షిండే వర్గానికి చెందిన మంత్రి ఉదయ్ సామంత్.. సంజయ్ రౌత్‌కు కౌంటర్ ఇచ్చారు. థాక్రే వర్గానికి చెందిన ఆరు నుంచి 13 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.