Gopal yadav | బీజేపీ కంటే వేగంగా రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తాం : సమాజ్వాదీ ఎంపీ
Gopal yadav | అయోధ్య రామ మందిర నిర్మాణంపై సమాజ్వాదీ ఎంపీ గోపాల్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. తాము గనక యూపీలో

Gopal yadav | అయోధ్య రామ మందిర నిర్మాణంపై సమాజ్వాదీ ఎంపీ గోపాల్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. తాము గనక యూపీలో అధికారంలోకి వస్తే, బీజేపీ కంటే చాలా వేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా చిత్రకూట్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. అఖిలేశ్ ఎంత ప్రయత్నించినా రామ మందిర నిర్మాణం ఆగదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సమాజ్వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ పై వ్యాఖ్యలు చేశారు. అసలు రామ మందిర నిర్మాణాన్ని ఎవరు ఆపుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాము గనక అధికారంలోకి వస్తే, ఆలయాల విరాళాలను దొంగలించే పనికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ‘నిజానికి బీజేపీ వారే అలా చేస్తున్నారు. అఖిలేశ్ గనక అధికారంలోకి వస్తే.. రామ మందిర నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేస్తాం. తాము అధికారంలోకి వస్తే ఆలయ విరాళాల దొంగతనానికి అడ్డుకట్ట వేసేస్తాం’ అని సమాజ్వాదీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

