Girl Swallows Phone | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. సోదరుడితో గొడవ పడిన ఓ 18 ఏండ్ల యువతి సెల్‌ఫోన్‌ను మింగేసింది. ఈ ఘటన భిండ్ (Bhind ) జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
జిల్లాకు చెందిన యువతి సోదరుడితో గొడవపడింది. గొడవ కాస్తా కాసేపటికి తారాస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి చైనీస్ మొబైల్ ఫోన్‌ను మింగేసింది. అనంతరం తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన సోదరుడు.. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో వారు యువతిని వెంటనే గ్వాలియర్ (Gwalior) లోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. అక్కడ యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె పొట్టలో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా మొబైల్‌ఫోన్‌ను బయటకు తీశారు.
ఆపరేషన్ అనంతరం యువతికి పది కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ కుష్వాహా (Dr Kushwaha) తెలిపారు. తన 20 ఏండ్ల వైద్య సర్వీస్‌లో ఇలాంటి ఘటన ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.
Also Read..
India Corona | అప్రమత్తంగా ఉండాల్సిందే.. భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు
UAE | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు తీర్పు
Holidays effect | వరుసగా మూడు రోజులు సెలవులు.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ