UAE | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం.. యూఏఈ కోర్టు తీర్పు
UAE | 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి యూఏఈ సుప్రీం కోర్టు (UAE Supreme Court ) కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీ (insurance company)ని ఆదేశించింది.
UAE | 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి యూఏఈ సుప్రీం కోర్టు (UAE Supreme Court ) కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీ (insurance company)ని ఆదేశించింది. ఖలీజ్ టైమ్స్ ( Khaleej Times) కథనం ప్రకారం..
భారత్‌కు చెందిన 20 ఏండ్ల మహ్మద్ బేగ్ (Muhammad Baig) దుబాయ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఒకరోజు ఒమన్ నుంచి యూఏఈకి బస్సులో ప్రయాణించాడు. అతడు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్హెడ్హైట్ బారియర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 12 మంది భారతీయులు. ఈ ఘటన 2019 సంవత్సరంలో జరిగింది.
కాగా, బస్సు ప్రమాదంలో బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మెదడులో సగ భాగం పూర్తిగా దెబ్బతినడంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రమాదం అనంతరం బేగ్ సుమారు 14 రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ ప్రమాదంలో బేగ్ మెదడుకు 50 శాతం మేర శాశ్వతంగా నష్టం వాటిల్లిందని వైద్యులు తెలిపారు. దీంతోపాటు ఇతర శరీర భాగాలు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు.
ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌కు అక్కడి కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్‌ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, బేగ్‌కు ఇన్సూరెన్స్ కంపెనీ కేవలం ఒక దిర్హామ్ మాత్రమే చెల్లించేందుకు ముందుకొచ్చింది. అందుకు బేగ్ కుటుంబం ఒప్పుకోలేదు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అది సరిపోదంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే బేగ్‌కు 5 మిలియన్ దిర్హామ్‌ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీని యూఏసీ సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో బేగ్‌కు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.11 కోట్లు పరిహారం కింద అందనున్నాయి.
Also Read..
India Corona | అప్రమత్తంగా ఉండాల్సిందే.. భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు
World Health Day | లైఫ్‌స్టైల్‌తోనే రోగాలు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

