న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో లోక్సభ ఎంపీ బీపీ సరోజ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని నార్త్ ఎవిన్యూ లోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ సరోజ్ మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్కు ఎంపీ అభినందనలు తెలియజేశారు.
Thank you Hon’ble MP @bpsarojmp ji for bracing #GreenIndiaChallenge and planting saplings. Hope your cadre & followers would replicate what you have done in the interest of secured future in terms of better environment for generations to come. pic.twitter.com/Ax6oGQTivy
— Santosh Kumar J (@MPsantoshtrs) June 15, 2021