పాల ధరను పెంచిన మదర్ డెయిరీ..

న్యూఢిల్లీ: అముల్ బాటలో మదర డెయిరీ అడుగులు వేసింది. లీటరు పాలపై రూ.2 పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, ఇతర నగరాల్లో ఈ పెంచిన ధరలు ఆదివారం నుంచే అములోకి రానున్నాయి. డెయిరీ రైతుల నుంచి పాల సేకరణ ధరలు గత ఏడాది 8 నుంచి 10 శాతం పెరిగినట్లు మదర్ డెయిరీ వెల్లడించింది. డిసెంబర్ 2019లో చివరిసారి మదర్ డెయిరీ పాలపై ధరలను పెంచింది. జూలై ఒకటి నుంచి అముల్ కూడా లీటరు పాలపై రెండు రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. యూపీలోని పలు నగరాలు, ముంబై, నాగపూర్, కోల్‌కతాలోనూ పాల ధరలను పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా సుమారు వంద నగరాల్లో మదర్ డెయిరీ పాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ప్రతి రోజు సుమారు 30 లక్షల లీటర్ల పాలను అమ్ముతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- amul
- Delhi
- Liter milk
- Milk price
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

