Mother Dairy | ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) వినియోగదారులకు షాకిచ్చింది. పాల ధరలను (Milk Prices) భారీగా పెంచేసింది (increased prices). అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ బుధవారం ఉదయం తెలిపింది. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా నేటి నుంచే (ఏప్రిల్ 30) అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో టోన్డ్ మిల్క్ (బల్క్ వెండెడ్ మిల్క్) లీటర్ ధర రూ.2 పెరిగి రూ.54 నుంచి రూ.56కు చేరింది. ఫుల్ క్రీమ్ పాలు ధర లీటరుకు రూ.69కి పెరిగింది. ఇక ఆవుపాల ధరలు లీటరుకు రూ.57కి, డబుల్ టోన్డ్ పాల ధర లీటరు రూ.51కి చేరింది.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మదర్ డైరీ అత్యధిక స్థాయిలో పాలను అమ్ముతోంది. ఆ నగరంలో రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో పాలను సరఫరా చేస్తోంది. చివరిసారి మదర్ డెయిరీ పాల ధరలను గతేడాదిన జూన్లో పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 పెంచింది.
Also Read..
Pak Nationals | దేశాన్ని వీడిన 786 మంది పాక్ పౌరులు.. అట్నుంచి 1,376 మంది రాక
PM Modi | మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
PM Modi | సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన