భువనేశ్వర్: ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందోగానీ ఓ ఇంట్లో ఓ నాగుపాము దూరింది. ఆ ఇంట్లోనే గుడ్లు పెట్టి పిల్లలు కూడా చేసింది. అయినా ఏనాడూ ఆ పాము ఇంట్లోవాళ్ల కంటపడలేదు. ఎవరికీ ఏ హాని కూడా తలపెట్టలేదు. అయితే ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా ఉన్న పాము శక్రవారం ఆ ఇంటి యజమాని కంటపడింది. దాంతో భయాందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులను అప్రమత్తం చేసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ పామును బంధించారు. ఆ పాముతోపాటు మొత్తం 26 పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. అనంతరం తల్లి పాముతోపాటు పిల్లలను కూడా ఓ సంచిలో బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Mother Cobra and 26 hatchlings rescued from a house in Odisha’s Kalahandi district
— ANI (@ANI) July 10, 2021
“All the 26 hatchlings with mother Cobra have been released to the safe and natural habitat," says Birendra Kumar Sahu, Snake Rescuer, Kalahandi Forest Department pic.twitter.com/qzLRShlDks
ఇవి కూడా చదవండి..
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!