జైపూర్: బీజేపీ పాలిత రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న వేధింపులు తట్టుకోలేక జోధ్‌పూర్‌లో ఓ లెక్చరర్, తన మూడేండ్ల బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో లెక్చరర్ సంజూ బిష్ణోయ్, ఆమె కుమార్తె యశస్వి ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం సాయ ంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన సంజూ బిష్ణోయ్.. కుర్చీలో కూర్చొని తనపై, తన కుమార్తెపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుంది.