న్యూఢిల్లీ: వాయవ్యం, ద్వీప ప్రాంతాలను మినహాయించి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా సగటు సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు(temperatures) నమోదు కానున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. నార్మల్ కన్నా ఎక్కువ స్థాయిలో హీట్‌వేవ్(heatwave) ఉంటుందని ఐఎండీ(IMD) తెలిపింది.
Above normal heatwave days are likely to occur over most parts of central India, east India and northwest India during the hot weather season April to June 2023.@DDNewslive pic.twitter.com/AoRerEzZCy
— India Meteorological Department (@Indiametdept) April 1, 2023
సెంట్రల్, తూర్పు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. బీహార్, జార్ఖండ్, యూపీ, ఒడిశా, బెంగాల్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర(Mrutyunjaya Mahapatra) తెలిపారు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయన్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నార్మల్ కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు కురవనున్నాయి.