MoS Muraleedharan | ఇజ్రాయెల్లో భారత పౌరుల భద్రతపై కేంద్ర మంత్రి మురళీధరన్ కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత పౌరులందరూ సురక్షితంగా ఉండాలని, ఎలాంటి సాయం కావాలన్నా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ. మురళీధరన్ (MoS Muraleedharan) విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులతో ఇజ్రాయెల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత పౌరులందరూ సురక్షితంగా ఉండాలని, ఎలాంటి సాయం కావాలన్నా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీ. మురళీధరన్ (MoS Muraleedharan) విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయెల్లో భారత పౌరులందరికీ భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసిందని, మన పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్ధితి ఉత్పన్నమైనా ఎంబసీతో సంప్రదింపులు జరపాలని కోరామని తెలిపారు.
ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని, స్ధానిక అధికారులు నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలను అనుసరించాలని ఇజ్రాయెల్లో భారత రాయబార కార్యాలయం శనివారం భారత పౌరులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, అనవసరంగా బయటతిరగకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ గైడ్లైన్స్లో కోరింది. ఇక ఇజ్రాయెల్లో హమాస్, ఇజ్రాయెల్ సైనిక బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.
Read More :
Israeli tourists shot dead | ఈజిప్టులో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

