Israeli tourists shot dead | ఈజిప్టులో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు మృతి
Israeli tourists shot dead | ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం తాజాగా ఈజిప్టునకు వ్యాపించింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు మరణించారు. (Israeli tourists shot dead) ఈజిప్ట్ జాతీయుడు కూడా ఈ కాల్పుల్లో చనిపోగా మరో ఇజ్రాయిల్ పర్యాటకుడికి బుల్లెట్ గాయాలయ్యాయి.
కైరో: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం తాజాగా ఈజిప్టునకు వ్యాపించింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు మరణించారు. (Israeli tourists shot dead) ఈజిప్ట్ జాతీయుడు కూడా ఈ కాల్పుల్లో చనిపోగా మరో ఇజ్రాయిల్ పర్యాటకుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద ఇజ్రాయిల్ పర్యాటకులపై ఈజిప్ట్ పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఇద్దరు ఇజ్రాయిల్ పర్యాటకులు, ఈజిప్ట్ వ్యక్తి మరణించారు. మరో ఇజ్రాయిల్ వ్యక్తికి గాయాలయ్యాయి.
కాగా, ఈజిప్ట్ భద్రతా బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇజ్రాయిల్ పర్యాటకులపై కాల్పులు జరిపిన ఈజిప్ట్ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్నాయి. మరణించిన, గాయపడిన ఇజ్రాయిల్ పర్యాటకులను మూడు అంబులెన్స్‌లలో హాస్పిటల్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు పాలస్తీనాలోని గాజాలో ఆదిపత్యం చెలాయిస్తున్న హమాస్ శనివారం అనూహ్యంగా ఇజ్రాయిల్‌పై 5,000 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇరువైపు దాడుల్లో సుమారు వెయ్యి మంది మరణించగా వందల సంఖ్యలో గాయపడ్డారు.
https://twitter.com/AhmedSamehAhly/status/1710947574411055519?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1710947574411055519%7Ctwgr%5Edb21233072cf4635273df4188ca552896895abdd%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fworld%2Fegypt-2-israeli-tourists-killed-in-firing-by-policeman-in-alexandria-shocking-visuals-surface
Two Israeli tourists were killed by an Egyptian policeman in Alexandria, Egypt.
Egypt Media.#Hamas #Israel #GazaUnderAttack #Palestine #طوفان_الأقصى #Egypt— Arslan Baloch (@balochi5252) October 8, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

