అహ్మదాబాద్: గుజరాత్లోని ఖేడాలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఖేడా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలకు నిప్పంటుకున్నది. దీంతో కార్లు, ఆటోలు, బైకులు సహా 25కుపైగా వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
అయితే అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కావాలనే వాహనాలకు ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో విచారిస్తున్నారు.