New Delhi | పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం..!
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్ (AIIMS Trauma Care) సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్ (AIIMS Trauma Care) సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సత్యనికేతన్ ప్రాంతంలోని ఐదంతస్తుల మేడ ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు విద్యార్థులు చిక్కుకుపోయారు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులు ఇప్పటివరకూ ఎనిమిది మందిని కాపాడామని తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్‌కు సమీపంలోని పీజీ భవనం కుప్పకూలిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. సత్యనికేతన్ ప్రాంతంలో ఇరుకుగా ఉండే హాస్టల్ భవంతుల సముదాయంలోని ‘హాస్టల్ డేజ్’ భవంతి ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో కూలిపోయింది. బేస్మెంట్లో నిర్మాణ పనులు జరుగుతుండగానే ఒక్కసారిగా బిల్డింగ్ పడిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు 1:33 గంటలకు అగ్నిమాపక కేంద్రానికి, సౌత్ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు.
STORY | Building collapses in south Delhi’s Satya Niketan; 1 dead, 2 critical, several trapped
A 50-year-old five-storey building housing a boys’ hostel collapsed in a congested bylane in Satya Niketan near Delhi University’s south campus on Sunday afternoon, leaving one dead… pic.twitter.com/68BnvBMqFY
— Press Trust of India (@PTI_News) September 6, 2026
ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్‌లో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాణభయంతో మమ్మల్ని కాపాడండి. మాకు సాయం చేయండి అని వారు ఫోన్లు చేశారు. దాంతో.. పోలీసులు, అధికారులు సహాయ చర్యలను వేగవంతం చేశారు. వీరికి విద్యార్థులు, స్థానికులు కూడా చేయందించగా శిథిలాల తొలగింపు ప్రక్రియ పుంజుకుంది.
ఈ దుర్ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడ్డవాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని షా అదేశించారు. బిల్డింగ్ యజమాని, గురుగ్రామ్‌కు చెందిన అనంద్ బన్సల్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

