ముంబై, సెప్టెంబర్ 21 : ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాను డీన్ పోస్ట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడ్ మృతికి సంబంధించి అతనిపై ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా సాహిల్ మృతిపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సంస్థ క్షమాపణలు తెలిపింది. ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే తన పదవి నుంచి దిగిపోయి, రాజీనామా చేశారని వస్తున్న వార్తలను సంస్థ ఖండించింది.
బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ 18న తన హాస్టల్ రూములో ఆత్మహత్య చేసుకున్నాడు. సస్పెండైన డీన్ సూర్యనారాయణ దుల్లాకు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్ మద్దతుగా నిలిచింది. ఆయన ఫ్యాకల్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారని తెలిపింది.