BTech Student | పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులంతా రోడ్డెక్కి రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
కరీంనగర్ బీటెక్ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు.. అంతా మాటల వరకే.. చేతల్లో అయితే ఏం లేదు.. స్కాలర్ షిప్ రావడం లేదు.. రీయింబర్స్ మెంట్ కూడా పడటం లేదు.. మేము కూడా రోడ్లపై ధర్నా చేస్తున్నం. మేం కూడా ఏం లేకనే కదా ఇట్లాంటి చిన్న చిన్న కాలేజీల్లో జాయిన్ అయి ఫీ రీయింబర్స్ మెంట్ వస్తదని చదువుకుంటున్నం. రీయింబర్స్ మెంట్ కూడా రావడం లేదు. మా తల్లిదండ్రులకు ఇలాంటివి తెలియవు. రీయింబర్స్ మెంట్ వస్తుంది కాబట్టే మమ్మల్ని చదివిపిస్తున్నరు. అట్లా అని జాయిన్ అయినం.. జాయిన్ అయిన తర్వాత రీయింబర్స్మెంట్ లేదు.. ఏం లేదు.. మా కోసం గ్లోబల్ సమ్మిట్లు పెట్టినమనుడు కేవలం మాటల వరకేనంటూ చెప్పుకొచ్చింది.
రేవంత్ రెడ్డికి ఏదైనా ఫామ్ నింపడం వచ్చా?
రేవంత్ రెడ్డి మాటలు చెప్పుడే కానీ, చేతలు చేసుడు ఏం లేదు
స్కాలర్షిప్ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏం లేదు
ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని మా తల్లిదండ్రులకు తెలిస్తే మా చదువు ఆపేస్తారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని వేచి… https://t.co/lU7tNdZgNN pic.twitter.com/1G1PC8e9G2
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!