Kashmir | శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణల వల్ల నియంత్రణ రేఖ వెంబడి జరిగిన నష్టాన్ని నేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు. పాక్ వైమానిక దాడుల్లో మూడు జిల్లాల్లో డజన్ల గ్రామాలు దెబ్బతిన్నాయి. వారి బాంబు దాడుల్లో 10 వేలకు పైగా ఇండ్లు ధ్వంసం కాగా, వందలాది మంది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు.
ప్రజాప్రతినిధులు చేసిన నష్టం అంచనా ప్రకారం కుప్వారా, రాజౌరి, యూరి, పూంచ్ జిల్లాల్లో భారీగానే నష్టం జరిగింది. నష్టం అంచనాను పరిశీలించి, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని నేతలు కోరుతున్నారు.