Operation Sindoor | న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించినట్లు భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను కచ్చితమైన ఆధారాలతో గుర్తించి, స్పష్టమైన ఆధారాలతో 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించి నేలమట్టం చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం డీజీఎంవో రాజీవ్ ఘాయ్ ఎయిర్‌మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ భూభాగంపై చేసిన దాడులను వీడియోలు, షాటిలైట్ చిత్రాలతో సహా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నారు.
“ఆ తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై జరిగిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. IC814 హైజాక్, పుల్వామా పేలుడులో పాల్గొన్న యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి హైలెవల్ టార్గెట్లు ఉన్నాయి. దాడుల తర్వాత వెంటనే పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడింది. విచక్షణా రహిత కాల్పుల వల్ల దురదృష్టవశాత్తూ పౌరులు, గ్రామాలు, గురుద్వారా వంటి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. విషాదకరమైన ప్రాణనష్టం జరిగింది. భారత వైమానిక దళం దాడులలో ప్రధాన పాత్ర పోషించింది రాజీవ్ ఘాయ్ తెలిపారు.
ఇక ఈ నెల 8, 9వ తేదీన రాత్రి భారత్‌పై పాకిస్తాన్ గగనతల దాడికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. డ్రోన్లు, మానవరహిత విమానాలు భారత్ వైపు దూసుకొచ్చాయి. వాటన్నింటిని భారత వైమానిక దళ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ క్రమంలో భారత్‌వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేశామన్నారు. ఇండియా వైపు దూసుకొచ్చిన ప్రతీ డ్రోన్‌ను నిర్వీర్యం చేశామన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశామన్నారు. మొత్తంగా మూడు రోజులపాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.
#WATCH | Delhi: DGMO Lieutenant General Rajiv Ghai says “…Those strikes across those nine terror hubs left more than 100 terrorists killed, including high value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf and Mudasir Ahmed that were involved in the hijack of IC814 and the… pic.twitter.com/IeH6Je6STE
— ANI (@ANI) May 11, 2025
#WATCH | Delhi: Air Marshal AK Bharti shows the detailed missile impact video at Bahwalpur terror camp. #OperationSindoor pic.twitter.com/OnT5sdwrND
— ANI (@ANI) May 11, 2025
#WATCH | Delhi: Air Marshal AK Bharti shows the detailed missile impact video at Muridke terror camp. #OperationSindoor pic.twitter.com/fzMCcCMCRn
— ANI (@ANI) May 11, 2025