Monsoon: ఢిల్లీకి చేరుకున్న నైరుతీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ ప్రకటన
Monsoon : నైరుతీ రుతపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తీవ్రమైన ఎండ, వడగాలులకు బ్రేక్ చెబుతూ.. వర్షాకాలం వచ్చినట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు ప్రకటించింది.
న్యూఢిల్లీ: నైరుతీ రుతపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తీవ్రమైన ఎండ, వడగాలులకు బ్రేక్ చెబుతూ.. వర్షాకాలం వచ్చినట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు ప్రకటించింది. దీనిపై ఇవాళ ఐఎండీ అధికారిక ప్రకటన చేసింది. యావత్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతీ రుతుపవనాలు చేరుకున్నట్లు ఐఎండీ తెలిపింది. జైసల్మేర్, చురు, భివాని, ఢిల్లీ, అలీఘడ్, కాన్పూర్, ఘాజిపూర్, గోండా, ఖేరి, మొరాదాబాద్, డెహ్రాడూన్, ఉనా, పఠాన్‌కోట్, జమ్మూ ప్రాంతాలకు నైరుతి చేరుకున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
#WATCH | Delhi: IMD scientist Soma Sen says, “Monsoon has advanced today… Safdarjung observatory recorded the highest rainfall of 228 mm in Delhi between 2.30 am and 5.30 am and the rest of the observatories reported heavy rainfall… Heavy rainfall will continue over north… pic.twitter.com/uuQlBuvFjL
— ANI (@ANI) June 28, 2024
శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తొలి వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. దీంతో పలు ప్రదేశాల్లో నీరు జామైంది. ట్రాఫిక్ జామ్‌లు కూడా ఏర్పడ్డాయి. సఫ్ధార్‌జంగ్ వెదర్ స్టేషన్ లో 153.7 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. గత ఏడాది జూన్ 26వ తేదీన ఢిల్లీలోకి వర్షాకాలం ఎంటరైంది. 2021లో జూన్ 30వ తేదీన, 2020లో జూన్ 25వ తేదీన మాన్సూన్ ఎంట్రీ ఇచ్చింది.
సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీతో పాటు అన్నింటి అధిక స్థాయిలో వర్షం నమోదు అయినట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఆమె చెప్పారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాదిలో భీకర వర్షాలు ఉంటాయన్నారు. యూపీ, ఢిల్లీలో అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు ఆమె వెల్లడించారు. రేపు, ఎల్లుండికి రెయిన్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi rains
- IMD
- Monsoon
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

