భువనేశ్వర్, జూన్ 12: ఒడిశా తొలి బీజేపీ సీఎంగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ బీజేపీ నేత, పత్నగర్ ఎమ్మెల్యే కేవీ సింగ్ డియో, నంపర నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా నెగ్గిన ప్రవతి పరిద ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రబ్బుబర్ దాస్ వీరితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. పలువురు బీజేపీ పాలిత సీఎంలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
మోహన్ మాఝీ వ్యక్తిగత కార్యదర్శి మహాపాత్ర (31) మంగళవారం ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భువనేశ్వర్లో బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి ఒక కారు వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.