పట్నా, ఏప్రిల్ 11: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా జైలులో ఉంటారని ఆర్జేడీ నాయకురాలు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో ప్రధాని మోదీ పోల్చడాన్ని తిప్పికొడుతూ మీసా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ వీటిని బుజ్జగింపు రాజకీయాలుగా చూస్తున్నారా? బీహార్‌కు వచ్చినప్పుడల్లా మా కుటుంబానిపై ఆయన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దేశ ప్రజలు ఇండియా కూటమికి అవకాశమిస్తే మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా జైల్లో ఉంటారు’ అని ఆమె అన్నారు.