సిక్కు నేతలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారతదేశం 1947లో పుట్టలేదని మోదీ వ్యాఖ్యానించారు. ప్రముఖ సిక్కు మతగురువులను శుక్రవారం తన నివాసానికి ఆహ్వానించారు. వారితో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతదేశం 1947లో ఆవిర్భవించలేదు. మన గురువులు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఎంతో అణచివేతకు గురయ్యాం. నేను అజ్ఞాతంలోకి వెళ్లాను. సిక్కులాగా మారువేషం వేసుకొన్నాను. పగిడీ ధరించాను’ అని మోదీ వారితో అన్నారు. కర్తార్పూర్ సాహిబ్ భారత్లోనే ఉండేలా చేయడంలో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మోదీ ఈ భేటీ నిర్వహించడం గమనార్హం.