PM Modi | వాషింగ్టన్: భారతీయ ఓటర్లు ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చెల్లాచెదురు చేసి, ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపిరినందించారని లోక్సభ ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ స్పందిస్తూ.. మోదీ ప్రభంజనం చెల్లాచెదురైంది అని వ్యాఖ్యానించింది. అనూహ్యమైన ఫలితాలు వెలువడ్డాయని, దశాబ్ద కాలపు మోదీ పాలనకు ఈ ఫలితాలు తిరోగమనం వంటివని పేర్కొంది.
ఈ ఫలితాలు మోదీ పాలన పట్ల ప్రజల అసంతృప్తిని ప్రతిబింబించాయని, ఓటమి ఎరుగని నేతను భారతీయ ఓటర్లు అస్థిరతకు లోనుచేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ‘ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆయన నేతృత్వం వహిస్తున్న బీజేపీ సాధారణ మెజారిటీని కూడా సాధించలేకపోయింది. భాగస్వామ్య పక్షాలపై మోదీ ఆధారపడక తప్పదు’ అని సీఎన్ఎన్ పేర్కొంది.