BJP | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో అసంతృప్తి పెల్లుబుకుతున్నది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టిక్కెట్ ఇస్తే తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టిక్కెట్ ఆశావహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించడం రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు.
తన ఆస్తులను కొట్టేసేందుకు స్వయానా తన తండ్రే కుట్రలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని కొడుకును చంపించాలని చూస్తున్నాడని మీనా ఆరోపించారు.