బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలిస్తే.. వెళ్తానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కర్ణాటక చేరుకున్న సీఎం హుబళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 1న బెంగళూరుకు వస్తున్నారని, విస్తరణ అంశం ప్రస్తావన ఉండదని ఈ సందర్భంగా అన్నారు.
పిలుపు వచ్చాకే ఢిల్లీకి వెళతానని అక్కడే చర్చిస్తానని చెప్పారు. బడ్జెట్లో కేటాయించిన గ్రాంట్లకు అనుగుణంగా అభివృద్ధిని అమలు చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. హుబళ్లిలో టైకాన్ సదస్సులో పాల్గొన్నారు. నవంబర్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ద్వారా ప్రపంచ అగ్ర పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానిస్తామన్నారు.