Jammu Kashmir Elections : కొన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మన సంస్కృతి, విశ్వాసాలను పణంగా పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం కత్రాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వారసుడు విదేశాలకు వెళ్లి మన దేవీ, దేవతలు దేవుళ్లు కాదని చెప్పారని, ఇది మన విశ్వాసాలను అవమానించడమేనని ప్రధాని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ను శిక్షించాలని అన్నారు. వీరు ఇదంతా ఏదో పొరపాటున చెప్పడం లేదని, ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్రని చెప్పారు. ఇతర మతాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకున్న నక్సల్ మైండ్సెట్ నుంచి ఇది పుట్టుకొస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నక్సల్ ఆలోచనా విధానం జమ్ములోని డోగ్రా సంస్కృతిని అవమానిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
వారు కేవలం తమ ఓటు బ్యాంక్ మినహా మరేమీ పట్టించుకోరని, అందుకే వాళ్లు ఏండ్ల తరబడి జమ్ము కశ్మీర్ మధ్య అంతరం పెంచాలని ప్రయత్నించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు ఎల్లప్పుడూ జమ్ము పట్ల వివక్ష చూపుతారని ఆరోపించారు. తాము జమ్మును ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చామని అన్నారు. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును ఎవరూ తిరగతోడలేరని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Read More :
Gmail | ఈ పని చేయకుంటే జీమెయిల్ అకౌంట్ డిలీట్.. రేపటి వరకే ఆఖరి ఛాన్స్..!