Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. ఎక్స్ వేదికగా ఆదివారం ఈ అంశంపై రాహుల్ మరోసారి స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు.
గతంలో కూడా పేపర్ లీకైన తర్వాత కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రాహుల్ ప్రశ్నించారు. ‘‘నీట్ 2024 : పేపర్ లీకైంది. పరీక్ష రద్దైంది. మంత్రి మాత్రం రాజీనామా చేయలేదు. సీబీఐ విచారణ జరిగింది. ఒక కమిటీ ఏర్పడింది. నీట్ 2026 : పేపర్ లీకైంది. పరీక్ష రద్దైంది. మంత్రి ఇప్పటికీ రాజీనామా చేయలేదు. ఎప్పట్లాగే సీబీఐ విచారణ జరుపుతోంది. ఇంకో కమిటీ ఏర్పాటైంది. మోదీజీ.. దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. వాటికి జవాబివ్వండి. వరుసగా పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి..? పరీక్షపై చర్చలో మీరు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారు..? వరుసగా పేపర్ లీకవుతున్నా సంబంధిత విద్యాశాఖ మంత్రిని ఇంకా ఎందుకు తొలగించడం లేదు” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టారు.
NEET 2024:
पेपर लीक हुआ। परीक्षा रद्द नहीं हुई। मंत्री ने इस्तीफ़ा नहीं दिया। CBI ने जांच बिठाई। एक कमेटी बनी।NEET 2026:
पेपर लीक हुआ। परीक्षा रद्द हुई। मंत्री ने फिर इस्तीफ़ा नहीं दिया। CBI फिर जाँच कर रही है। एक और कमेटी बनेगी।मोदी जी, देश आपसे कुछ सवाल पूछ रहा है – जवाब…
— Rahul Gandhi (@RahulGandhi) May 17, 2026
రెండు రోజుల క్రితం కూడా నీట్ పేపర్ లీకేజీపై రాహుల్ స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, లేదా దీనికి మోదీయే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాదికి సంబంధించి జరిగిన నీట్ పేపర్ లీకేజీపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితుల్ని సీబీఐ అరెస్టు చేసింది.