తమిళ ప్రజలపై మోదీకి గౌరవం లేదు: రాహుల్‌గాంధీ

కోయంబత్తూర్: ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ప్రజలపైన, తమిళ భాషపైన, సంస్కృతిపైన ఏమాత్రం గౌరవం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలను, భాషను, సంస్కృతిని తన సిద్ధాంతాలకు, పద్ధతులకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని మోదీ భావిస్తున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడుకు వెళ్లిన రాహుల్‌గాంధీ.. ఇవాళ కోయంబత్తూర్ రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీపైన రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ న్యూ ఇండియా దృష్టి కోణంలో తమిళనాడు ప్రజలను దేశంలో రెండో తరగతి ప్రజలుగా చూస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశంలో రకరకాల భాషలు, సంస్కృతులు ఉన్నాయని, తమిళం, హిందీ, బెంగాలీ, ఆంగ్లం ఇలా అన్ని భాషలను మనం గౌరవించుకోవాలని రాహుల్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అక్షర్ అశ్విన్ ఆడుకున్నారు
- వుడ్స్‌కు తీవ్రగాయాలు
- కబడ్డీ జూనియర్స్ జిల్లాజట్ల ఎంపిక
- జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం
- తెలంగాణ బోణీ
- జిల్లా గ్రంథాలయాలన్ని సందర్శించిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే
- రేపటిలోగా కస్టమ్ మిల్లింగ్ పూర్తిచేయాలి
- జ్యోతి సంచలనం
- జోరుగా సభ్యత్వాల నమోదు
- ఇంటికి తాళం..సొత్తు మాయం!