Mithun Manhas : ‘భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)’ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ (Mithun Manhas) నియమితులయ్యారు. ఇవాళ (ఆదివారం) ముంబైలోని బీసీసీఐ కార్యాలయం (BCCI office) లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస్ను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు.
దేవజిత్ సైకియా గౌరవ కార్యదర్శిగా, ప్రభుతేజ్ సింగ్ భాటియా జాయింట్ సెక్రెటరీగా, కోశాధికారిగా ఎ రఘురామ్ భట్లను నియమించారు. ఇటీవల 70వ ఏట అడుగుపెట్టిన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో 45 ఏళ్ల మిథన్ మన్హాస్ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు.
ఈ నియామకంతో జమ్ముకశ్మీర్లో పుట్టి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి వ్యక్తిగా మిథున్ మన్హాస్ గుర్తింపు పొందారు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అపార అనుభవం ఉన్న మిథున్ మన్హాస్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.