బెంగుళూరు: బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు(Bengaluru Blast) సంఘటన చోటుచేసుకున్నది. ఆ పేలుడులో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. గ్రీన్ అవెన్యూ రోడ్లో ఉన్న వైట్‌ఫీల్డ్ బ్రాంచ్ కేఫ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఏ కారణంగా పేలుడు జరిగిందో ఇంకా స్పష్టం కాలేదు. గాయపడ్డవారు ఆ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగులు అని తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ సిలిండర్ వల్ల పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.