Mehul Choksi | పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్టుపై విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. తమ అభ్యర్థన మేరకే అక్కడి పోలీసులు అరెస్టు చేశారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్ నుంచి పారిపోయిన చోక్సీ కోసం దర్యాప్తు సంస్థలు భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అప్పగింత విషయంలో బెల్జియంతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. రూ.13,500 కోట్ల బ్యాంకు రుణం మోసం కేసును దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. చోక్సీ అప్పగింతపై విదేశాంగశాఖ చర్చలు జరిపిందని.. బెల్జియంతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.
మరో వైపు 26/11 ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా.. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రమే ఖ్యాతి తగ్గదన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సమస్యలపై చర్చిస్తారన్నారు. అమెరికా సుంకాలపై మాట్లాడుతూ.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా నుంచి ఆహ్వానం అందిందని.. విక్టరీ డే వేడుకల్లో భాగస్వామ్యాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. మరో వైపు కైలాస్ మానస సరోవర్ యాత్ర గురించి మాట్లాడుతూ.. యాత్ర విషయంలోనే త్వరలో ప్రకటన జారీ చేస్తామని.. త్వరలోనే తిరిగి యాత్ర ప్రారంభమవుతుందన్నారు.
భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమాన సేవలపై మాట్లాడుతూ.. సూత్రప్రాయంగా విమాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని.. ఇందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. ఇరువైపులా సాంకేతిక ఏర్పాట్లపై పౌర విమానాయాన అధికారులతో సమావేశం జరిగిందని.. ఫ్రేమ్‌వర్క్‌తో సహా సంబంధిత పద్ధతులపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బిల్లులో అని అంశాలు భారత్ అంతర్గత విషయమన్నారు. క్వాడ్ భవిష్యత్ ఉజ్వలంగా ఉందని.. త్వరలోనే క్వాడ్ శిఖరాగ్ర సమావేశం తేదీలను ప్రకటిస్తారన్నారు. యూఎస్-ఇరాన్ చర్చలను సానుకూల పరిణామంగా తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై మాట్లాడుతూ బంగ్లాతో భారత్ సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తుందన్నారు. వాణిజ్య సమస్యల విషయానికి వస్తే.. గత వారం ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యంపై ప్రకటించామన్నారు.