Virendra Kumar | ప్రజలకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ (Virendra Kumar) కీలక విజ్ఞప్తి చేశారు. పాదాలను తాకడంపై నిషేధం ఉందని.. అలా చేసిన వారికి పనులు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని తికమ్గఢ్ (Tikamgarh)లోగల తన కార్యాలయం వద్ద వినూత్న బోర్డు ఏర్పాటు చేశారు. ‘పాదాలను తాకడంపై నిషేధం ఉంది. అలా చేసిన వారికి ఎటువంటి పనులూ అప్పగించేది లేదు’ అంటూ పోస్టర్ను ఏర్పాటు చేశారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, రాజకీయ నేతలు షాక్ అవుతున్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన వారంతా ఈ బోర్డును ఆసక్తిగా తిలకిస్తున్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ పనిని ప్రశంసిస్తున్నారు.
కాగా, వీరేంద్ర కుమార్కు స్థానికంగా ఓటమి ఎరుగని నాయకుడిగా పేరుంది. ఆయన 1996లో తొలిసారి సాగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తికమ్గఢ్ రిజర్వ్డ్ లోక్సభ స్థానం నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019లో ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు 2024లోనూ అదే విజయ పరంపర కొనసాగించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు.
Also Read..
Punjab Bandh | రైతుల ఆందోళనతో స్తంభించిన పంజాబ్.. 163 రైళ్లు రద్దు
Spadex mission | స్పాడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు.. ప్రకటించిన ఇస్రో
Netanyahu | నెతన్యాహుకు ప్రొస్టేట్ గ్రంథి శస్త్రచికిత్స విజయవంతం.. ప్రకటించిన వైద్యులు