కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు ఫగ్గన్‌సింగ్ కులస్తే రోడ్డుపక్కన మక్కకంకులు బేరమాడుతూ వీడియోకు చిక్కారు. ఆయన కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఓ కుర్రాడు కంకులు కాలుస్తుండడం గమనించారు. స్వయంగా కారు దిగి వచ్చి కుర్రాడితో మూడు కంకులు కాల్పించుకున్నారు. చక్కగా నిమ్మరసం..కారం రాయించుకున్నారు. ఆ తర్వాత బేరమాడడం మొదలెట్టారు. ఒక్క కంకి ఎంత? అని కేంద్ర మంత్రి అడగ్గా..రూ. 15 అని కుర్రాడు సమాధానమిచ్చాడు. దీంతో మంత్రి ఆశ్చర్యపోయారు. కేంద్ర మంత్రికి ఆ కుర్రాడు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘ఈ రోజు సియోని నుంచి మాండ్లాకు వెళ్తున్నాను. స్థానిక మక్కకంకి రుచి చూశాను. మనమందరం స్థానిక రైతులు, దుకాణదారుల నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధిని ఇస్తుంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో మొదట ఫగ్గన్ సింగ్ కులస్తే.. కుర్రాడు మక్క కంకి రేటు చెప్పగానే.. ఇంత రేటా? అని ప్రశ్నించారు. ‘ఒక్కోటి రూ. 15..మొత్తం మూడు కంకులకు రూ. 45 ఇవ్వాలా?’ అని అడిగారు. దీనికి ఆ కుర్రాడు.. ‘కంకి స్టాండర్డ్ ధర రూ. 15.. మీకు కారు ఉందని ఆ రేటు చెప్పలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో కులస్తే.. ఆ కుర్రాడు అడిగినంత డబ్బులిచ్చి కంకులను కొనుగోలు చేశారు. కాగా, కంకులమ్మే కుర్రాడితో కేంద్రమంత్రి బేరమాడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU
— Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022