Mig-29K | భారత నేవీ మరో ఘనత.. ఐఎన్ఐ విక్రాంత్‌పై మిగ్29కే నైట్ ల్యాండింగ్ విజయవంతం..!
MiG-29K | భారత నౌకాదళం మరో ఘనతను సాధించింది. స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై మిగ్-29కే నైట్ ల్యాండింగ్ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ గురువారం ప్రకటించింది. మిగ్-29కే మొదటిసారిగా రాత్రి సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండింగ్ చేపట్టి నేవి మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది.
Mig-29K | భారత నౌకాదళం మరో ఘనతను సాధించింది. స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై మిగ్-29కే నైట్ ల్యాండింగ్ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ గురువారం ప్రకటించింది. మిగ్-29కే మొదటిసారిగా రాత్రి సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండింగ్ చేపట్టి నేవి మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ పట్ల నౌకాదళం ప్రోత్సాహాన్ని సూచిస్తుంది’ అంటూ నేవీ ట్వీట్ చేసింది.
సవాల్‌తో కూడిన నైట్ ల్యాండింగ్‌లో విక్రాంత్ సిబ్బంది, నౌకాదళ పైలట్ల సంకల్పం, నైపుణ్యాన్ని ప్రదర్శించారని, వారిని అభినందించాల్సిందేనని పేర్కొంది. ల్యాడింగ్ విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగస్వాములైన సిబ్బంది, అధికారులను ఆయన ప్రశంసించారు. ఇంతకు ముందు మార్చి 28న కమోవ్ 31 హెలికాప్టర్ సైతం ఐఎన్ఎస్ విక్రాంత్‌పై విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. టెస్టింగ్ సమయంలో స్వదేశీ లైటింగ్ ఎక్విప్మెంట్స్, షిప్‌బోర్న్ సిస్టమ్స్‌ను వినియోగించగా.. విజయవంతమైందని అధికారులు పేర్కొన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతలు ఇవే..
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో నిర్మించారు. దీనికి పొడవు 262 మీటర్లు కాగా.. వెడల్పు సుమారు 62 మీటర్లు. 59 మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది. ఇది భారతదేశ తొలి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక, ఇందులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ యుద్ధనౌకను ‘కదిలే నగరం’గా.. ‘బాహుబలి నౌక’గా పేర్కొంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు దాదాపు 40వేల టన్నులు. ఈ యుద్ధనౌకలో 14 డెక్‌లు, 2300 కంపార్ట్మెంట్లు ఉంటాయి. 1700 మంది సిబ్బందికి వసతి ఉంటుంది. ఇందులో మహిళా అధికారుల కోసం ప్రత్యేక క్యాబిన్లు సైతం ఉన్నారు. అలాగే ఐసీయూ నుంచి వైద్య సంబంధిత సేవలు, శాస్త్రీయ ప్రయోగశాలలు సైతం ఏర్పాటు చేశారు.
ఈ యుద్ధ నౌక గరిష్ఠంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ వేగం 18 నాట్స్. అంటే 33 కిలోమీటర్లు. ఈ వాహక నౌక ఒకేసారి 7500 నాటికల్ మైళ్లు అంటే.. 13వేల కిలోమీటర్లపైగా దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఒకేసారి 30 విమానాలను తీసుకువెళ్తుంది. వీటిలో MiG-29K ఫైటర్ జెట్లతో పాటు Kamov-31 హెలికాప్టర్లు, MH-60R సీహాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు, HAL తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు వంటి ఉన్నాయి. నేవీ కోసం భారత్‌లో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం LCA తేజస్ సైతం ఈ వాహక నౌక నుంచి సులభంగా టేకాఫ్ చేయవచ్చు.
#IndianNavy achieves another historic milestone by undertaking maiden night landing of MiG-29K on @IN_R11Vikrant indicative of the Navy’s impetus towards #aatmanirbharta.#AatmaNirbharBharat@PMOIndia @DefenceMinIndia pic.twitter.com/HUAvYBCnTH
— SpokespersonNavy (@indiannavy) May 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

