న్యూఢిల్లీ, మే 14: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్లను ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల్లో 3 శాతం మందిని, అంటే దాదాపు 6 వేల మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద తొలగింపు ప్రక్రియ.
అలాగే కంపెనీలో సంస్థాగత మార్పులకూ మైక్రోసాఫ్ట్ శ్రీకారం చుడుతున్నది. రీహైరింగ్ ప్రక్రియలోనూ కీలక మార్పులు తీసుకొస్తున్నది. పోటీ ప్రపంచంలో ఉన్నతస్థానంలో నిలవాలంటే ఇలాంటి మార్పులు తప్పవని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.