Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కేసు (liquor policy scam)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీహార్ జైలు (Tihar Jail)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీకి స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజులపాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో సోమవారం సాయంత్రం కేజ్రీని అధికారులు తీహార్ జైలుకు తరలించారు.
జైల్లో తొలిరోజు రాత్రి కేజ్రీవాల్ హాయిగా నిద్రపోయినట్లు జైలు వర్గాలు తెలిపాయి. అనంతరం ఇవాళ ఆయన యోగా, బ్రెడ్-టీతో తన రోజును ప్రారంభించినట్లు చెప్పారు. ఉదయం లేవగానే 6.30 గంటలకు కేజ్రీవాల్‌కు బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్, టీ అందించినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అల్పాహారం చేసి మందులు వేసుకున్నట్లు తెలిపాయి. అదేవిధంగా కేజ్రీవాల్ తన సెల్లో గంటకుపైగా ధ్యానం (Meditation) చేసుకున్నారని, ఆ తర్వాత యోగా కూడా చేసినట్లు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం ఇవ్వనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్ అభ్యర్థనలకు కోర్టు ఆమోదం.. ఏవేవి అనుమతించిందంటే..?
Maneka Gandhi | కుమారుడికి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై స్పందించిన మేనకా గాంధీ
Aam Aadmi Party: ఎన్నికలకు ముందే మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు: అతిషి