NEET Exam | ‘నీట్’గా మరో స్కామ్..! రూ.20 లక్షలకు గవర్నమెంట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఆఫర్
నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి క్యాన్సిల్ కావడం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపుతున్నదో చూస్తున్నాం. జూన్ 21న పేపర్ రీఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించబోతున్నది.
- రూ.20 లక్షలకు గవర్నమెంట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఆఫర్
- విద్యార్థులతో బ్రోకర్ల బేరం
న్యూఢిల్లీ, జూన్ 3: నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి క్యాన్సిల్ కావడం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపుతున్నదో చూస్తున్నాం. జూన్ 21న పేపర్ రీఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించబోతున్నది. అయితే నీట్ స్కామ్‌లో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బ్రోకర్లు స్టూడెంట్లకు గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని.. ఇందుకోసం రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారట. లీక్ అయిన పేపర్‌ను అమ్మడానికి ఒక్కరి దగ్గరి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరికొందరికి నేరుగా సీట్లు ఎరగా వేశారట. అహ్మదాబాద్‌కు చెందిన శుభమ్ థాకేర్ తనతో సదరు బ్రోకర్లు మెడికల్ సీట్లను ఆఫర్ చేస్తూ మాట్లాడిన ఆడియో కాల్‌ను రికార్డు చేసి బయటపెట్టాడు.
ఏమీ రాయకుండా వదిలేయాలి..
ఈ మెడికల్ సీట్ల కోసం విద్యార్థులకు బ్రోకర్లు కొన్ని సూచనలు చేశారు. ఎవరైతే సీట్లు కావాలనుకుంటారో వాళ్ల్లు ఎగ్జామ్ ఆన్సర్ షీట్లలో ఏమీ రాయకుండా ప్లేన్‌గా వదిలేయాలి. ఆ ఎగ్జామ్ సెంటర్లలో ఉండే కొందరు స్టాఫ్ మెంబర్లు, అధికారులు ఆ ఆన్సర్ షీట్లను సరైన సమాధానాలతో నింపుతారు. వీళ్లు సదరు బ్రోకర్ల నుంచి ఇందుకోసం పేమెంట్ తీసుకుంటారట. అయితే మెరుగైన ర్యాంకులు వచ్చే స్థాయిలో కాకుండా గవర్నమెంట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు వచ్చే స్థాయిలో ఆన్సర్లు నింపుతారట. ఈ విషయంపై ఇప్పుడు మరో రచ్చ జరుగుతున్నది. ఎగ్జామ్ సెంటర్లలో అధికారులు కూడా అమ్ముడుపోయారా? అంటూ స్టూడెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

