Mayawati | ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) మేనకోడలు అత్తింటివారిపై కేసు పెట్టింది. పెళ్లైనప్పటినుంచి భర్త, అత్త మామలు తనను వరకట్న వేధింపులకు (Dowry Prohibition) గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాధితురాలికి 2023 నవంబర్ 09న హాపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్పర్సన్ పుష్పాదేవి కుమారుడు విశాల్ సింగ్తో వివాహం జరిగింది. అయితే, పెళ్లైనప్పటి నుంచి భర్త విశాల్, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు తనను వరకట్న వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు లైంగికంగా కూడా వేధింపులకు ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బాడీబిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ వాడాడని, దీనివల్ల అతను వైవాహిక జీవితానికి అనర్హుడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది.
తన భర్త వైద్య పరిస్థితి గురించి తన అత్తమామలను తెలుసునని పేర్కొంది. దీంతో తన బావమరిది భూపేంద్రతో కమిట్ అయ్యి బిడ్డకు జన్మనివ్వాలని బలవంతం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 2025 ఫిబ్రవరి 17న తన మామ, బావమరిది తనను దారుణంగా కొట్టి, లైంగిక వేధింపులకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. వారి వేధింపులు భరించలేక తాను పుట్టింటికి వెళ్లిపోయినట్లు చెప్పింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. అందుకే తాను మార్చి 24న నేరుగా కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొంది.
కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి భర్త, అత్తమామలు, మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై గృహహింస, వరకట్న, లైంగిక వేధింపుల అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసు అధికారి మునీష్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని సింగ్ తెలిపారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పుష్పాదేవి కుటుంబ సభ్యులను బీఎస్పీ నుంచి బహిష్కరించారు.
Also Read..
Himanta Sarma | ముంబై ఉగ్రదాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా : అస్సాం సీఎం
Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షబీభత్సం.. 47 మంది మృతి
Google LayOffs | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్లో లేఆఫ్స్.. వందలాది మందిపై వేటు..!